Asianet News TeluguAsianet News Telugu

విశాఖ శారదాపీఠంలో విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి.. సింహాచలం కొండవాలు ప్రాంతంలో...

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు.

First Published Nov 5, 2022, 1:17 PM IST | Last Updated Nov 5, 2022, 1:17 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠ ప్రాంగణంలోని ఇతర దేవతామూర్తుల ఆలయాలను సందర్శించారు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం సింహాచలం కొండవాలు ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి శంకుస్థాపన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి శంకుస్థాపన చేశారు. రక్షణ గోడ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామని ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి అన్నారు.