Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని మోదీ విశాఖ పర్యటన... ఏర్పాట్లను పరిశీలించిన విజయసాయి రెడ్డి

విశాఖపట్నం : ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ విశాఖపట్నంకు చేరుకుని రేపు(శనివారం) వివిధ అభివృద్ది పథకాలను శంకుస్థాపనలు చేయనున్నారు. 

First Published Nov 11, 2022, 2:01 PM IST | Last Updated Nov 11, 2022, 2:00 PM IST

విశాఖపట్నం : ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ విశాఖపట్నంకు చేరుకుని రేపు(శనివారం) వివిధ అభివృద్ది పథకాలను శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలోని ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో ఏపీ ప్రభుత్వం నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సభ నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లను ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జ్ వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్ నాథ్, ఎంపీ విజయసాయి రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభ ఏర్పాట్లతో పాటు ఇతర అంశాలపై విశాఖ కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులతో విజయసాయి రెడ్డి చర్చించారు.