పేదలకు అండగా.. ప్రగతి భారత్ ఫౌండేషన్..
విశాఖపట్నం, జివిఎంసి పరిధిలోని వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి ప్రగతి భారత్ పౌండేషన్ తరఫున నిత్యవసర సరుకులు, మాస్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది.
విశాఖపట్నం, జివిఎంసి పరిధిలోని వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి ప్రగతి భారత్ పౌండేషన్ తరఫున నిత్యవసర సరుకులు, మాస్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. వెంకోజిపాలెం సీఎంఆర్ ఫంక్షన్ హాల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రగతి భారత్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 1500 మందికి సరుకులతో కూడిన సంచులను అందజేశారు.