Asianet News TeluguAsianet News Telugu

గ్రామీణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటిముందుకే విద్యావారధి వాహనాలు..

ఏపీలో ప్రభుత్వ స్కూల్స్ లో చదివే విద్యార్థులకు ఆన్ లైన్, డిజిటల్ పాఠాలకు శ్రీకారం చుట్టారు. 

ఏపీలో ప్రభుత్వ స్కూల్స్ లో చదివే విద్యార్థులకు ఆన్ లైన్, డిజిటల్ పాఠాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సప్తగిరి ఛానల్ లో విద్యా వారధి, విద్యామృతం, విద్యా కలశం, అభ్యాసన లాంటి కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చిందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రతి జిల్లాలో మొబైల్ వ్యాన్స్ ద్వారా విద్యా వారధి అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ విద్యావారధి వాహనంలో ఒక ఎల్ సీడీ స్క్రీన్స్, లైబ్రరీ, ఒక టీచర్ ఉంటారు. మారుమూల ప్రాంతాల్లోని, ఎలాంటి నెట్ వర్క్, టెక్నాలజీ అందుబాటులో లేని విద్యార్థుల కోసం ప్రారంభించారు. ప్రతి జిల్లాకు ఒక విద్యావారధి వ్యాన్ పంపిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. 

Video Top Stories