Asianet News TeluguAsianet News Telugu

చారిత్రక గ్రంథాలయానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య రూ.5లక్షల విరాళం

విజయవాడ: ఊరికో గ్రంథాలయం - ఇంటికో స్వచ్ఛాలయం నినాదం కావాలని... స్వచ్ఛ భారత్ లాగే గ్రంథపఠనం ప్రజాఉద్యమ రూపుదాల్చాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. 

First Published Oct 31, 2021, 4:25 PM IST | Last Updated Oct 31, 2021, 4:25 PM IST

విజయవాడ: ఊరికో గ్రంథాలయం - ఇంటికో స్వచ్ఛాలయం నినాదం కావాలని... స్వచ్ఛ భారత్ లాగే గ్రంథపఠనం ప్రజాఉద్యమ రూపుదాల్చాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. విజయవాడలోని చారిత్రక రామ్మోహన్ గ్రంథాలయాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా తమ కుమార్తె దీపా వెంకట్ నిర్వహిస్తున్న స్వర్ణభారత్ ట్రస్ట్ తరుఫున 2.5 లక్షలు, కుమారుడు హర్షవర్ధన్ నిర్వహిస్తున్న ముప్పవరపు ఫౌండేషన్ నుంచి 2.5 లక్షల చొప్పున మొత్తం 5 లక్షల రూపాయలను గ్రంథాలయ అభివృద్ధి కోసం విరాళంగా ప్రకటించారు.