Asianet News TeluguAsianet News Telugu

వంగవీటి రంగా ఇండియన్ రాబిన్ హుడ్...: జనసేన నేత శేషుబాబు

అవనిగడ్డ : ప్రముఖ నాయకుడు వంగవీటి మోహనరంగా 34వ వర్ధంతి వేడుకలను పార్టీలకు అతీతంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.

First Published Dec 26, 2022, 2:26 PM IST | Last Updated Dec 26, 2022, 2:26 PM IST

అవనిగడ్డ : ప్రముఖ నాయకుడు వంగవీటి మోహనరంగా 34వ వర్ధంతి వేడుకలను పార్టీలకు అతీతంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇలా అవనిగడ్డ నియోజకవర్గంలో కూడా రంగా రాధ మిత్రమండలి సభ్యలు, జనసేన పార్టీ నాయకులు వంగవీటి రంగా విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించారు. అవనిగడ్డ మండల జనసేన అధ్యక్షుడు గుడివాక శేషుబాబు, రంగా రాధ మిత్ర మండలి నాయకులు యాసం చిట్టిబాబు పట్టణంలోని రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.  

ఈ సందర్భంగా శేషుబాబు మాట్లాడుతూ... రంగా కేవలం కాపు వర్గానికే కాదు అన్నివర్గాలకు చెందినవాడని అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడి ఇండియన్ రాబిన్ హుడ్ అనే ఖ్యాతి ఆయనకే దక్కిందన్నారు. ఇక చిట్టిబాబు మాట్లాడుతూ...  రంగా బ్రతికుండగానే కాదు మరణించి ఏళ్లు గడుస్తున్నా నేటికీ ఆయన మీద అభిమానం ప్రజల్లో ఏమాత్రం తగ్గలేదని పేర్కొన్నారు.