హ్యాట్సాఫ్ వనజీవి రామయ్య... ఆరోగ్యం సహకరించకున్నా ఆగని మొక్కల పెంపకం
ఖమ్మం: పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటుతూ, చెట్ల పెంపకాన్ని చేపడుతూ తన ఇంటిపేరునే వనజీవిగా మార్చకున్న రామయ్య.
ఖమ్మం: పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటుతూ, చెట్ల పెంపకాన్ని చేపడుతూ తన ఇంటిపేరునే వనజీవిగా మార్చకున్న రామయ్య. ప్రతినిత్యం పర్యావరణ పరిరక్షణ చేపడుతున్న రాయయ్య ఇటీవల ప్రమాదానికి గురయ్యాడు. మొక్కలకు నీళ్లు పడుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో గాయాలపాలై హాస్పిటల్లో చికిత్స పొందారు. ఈ క్రమంలో ఇటీవలే కోలుకుని డిశ్చార్జయిన ఆయన ఆరోగ్యం సహకరించకున్నా మనసు మొక్కల పెంపకం వైపే లాగుతున్నట్లుంది. నిన్న (ఆదివారం) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆరోగ్యం సహకరించకున్నా ఓ వాహనంలో కూర్చుని రామయ్య, నడుచుకుంటూ అతడి భార్య జానమ్మ రోడ్డుపక్కన విత్తనాలు జల్లుతూ కనిపించారు. ఖమ్మం గ్రామీణ మండలంలోని రెడ్డి పల్లి-ముత్తగూడెం రహదారి మార్గంలో ఆదర్శ దంపతులు రామయ్య-జానమ్మ చిన్నచిన్న గుట్టలపై విత్తనాలు జల్లారు. ఈ విషయం ఓ వార్తాపత్రికలో చదవి తెలుసుకున్న టీఆర్ఎస్ ఎంపీ సంతోష్... పర్యావరణ పరిరక్షణకై సతీమణితో కలిసి విత్తనాలను వ్యాప్తి చేస్తూ మాలో స్ఫూర్తి నింపినందుకు రామయ్య గారూ హ్యాట్సాఫ్ అంటూ ట్వీట్ చేసారు.