ఏపీని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం... కలిసిరండి: వైసిపి ప్రభుత్వాన్ని కోరిన కేంద్ర మంత్రి

విశాఖపట్నంలో జరిగిన గరీబ్ కల్యాణ్ సమ్మేళన్ (పేదల సంక్షేమ సమ్మెళనం) కార్యక్రమంలో కేంద్ర మంత్రి సర్వానంద్ సోనోవాల్ పాల్గొన్నారు.

First Published May 31, 2022, 3:14 PM IST | Last Updated May 31, 2022, 3:14 PM IST

విశాఖపట్నంలో జరిగిన గరీబ్ కల్యాణ్ సమ్మేళన్ (పేదల సంక్షేమ సమ్మెళనం) కార్యక్రమంలో కేంద్ర మంత్రి సర్వానంద్ సోనోవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర పథకాల ద్వారా లబ్దిపొందిన వారు కేంద్ర మంత్రితో ముచ్చటించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో గత ఎనిమిదేళ్ల పాలనలో అందించిన 13 పథకాలు ఎలా ఉపయోగపడ్డాయో లబ్ధిదారులు మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి సోనోవాల్ మాట్లాడుతూ... ఏపీ సహజవనరులతో కూడిన సుందర రాష్ట్రమని అన్నారు. ఈ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లోనూ అభివృద్ది చేయాలని ప్రధాని మోదీ నిర్ణయించారని తెలిపారు.  ఏపి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసిరావాలని కోరారు. దేశంలోనే ఏపీని ఒక అత్యుత్తమ‌ రాష్ట్రంగా మార్చటానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని కేంద్రమంత్రి సోనోవాల్ కోరారు.