విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో లేనట్లే... కేంద్ర ఉక్కు మంత్రి కీలక ప్రకటన
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే కీలక వ్యాఖ్యలు చేసారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికయితే స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం లేదని కేంద్ర మంత్రి స్ఫష్టం చేసారు. ఉక్కు పరిశ్రమను మరింత అభివృద్ది పరిచేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు. ముఖ్యంగా స్టీల్ తయారీకి ఉపయోగించే ముడిసరుకు, మైనింగ్ అవసరాలపై దృష్టి పెట్టామన్నారు. స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు అవసరాలపై యాజమాన్యంతో మాట్లాడతామని... కార్మిక సంఘాల అభిప్రాయాలను స్వీకరిస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ విషయంలో తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మంత్రి స్పందించారు.