పొంచివున్న యాస్ తుఫాను ప్రమాదం... అమిత్ షాతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
అమరావతి: బంగాళఖాతంలో ఏర్పడిన యాస్ తుపాను ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అమరావతి: బంగాళఖాతంలో ఏర్పడిన యాస్ తుపాను ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు సీఎం వైయస్ జగన్. ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, విపత్తు నిర్వహణశాఖ కమిషనర్ కె.కన్నబాబుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.