ప్రభుత్వం నిబంధనలు బేఖాతర్...ఫీజు కట్టలేదని విద్యార్థిని తరగతిలోకి రానివ్వని యాజమాన్యం...

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి విద్యార్థుల పై ఫీజుల విషయంలో వత్తిడి తీసుకుని వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పలు సందర్భాల్లో హెచ్చరించారు. 

First Published Oct 25, 2021, 11:22 PM IST | Last Updated Oct 25, 2021, 11:44 PM IST

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి విద్యార్థుల పై ఫీజుల విషయంలో వత్తిడి తీసుకుని వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పలు సందర్భాల్లో హెచ్చరించారు. అయినప్పటి ఆ ఆదేశాలు ఏమత్రం మాకు పట్టవని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.. ఫిరంగిపురం లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ యాజమాన్యం. దీనికి సంబంధించిన ఒక వీడియో ను తీయడం జరిగింది. ఎందుకు చెట్టుకింద ఒక్కడివే కూర్చున్నవాని ఆ బాల విద్యార్ధి ని ప్రశ్నించగ.. ఫీజు కట్టలేదని నన్ను మిస్ చెట్టుకింద కూర్చోమన్నారు అని అమాయకంగా సమాధానం ఇచ్చాడు.. ఇదేవిధంగా తోటి పిల్లపై చాలా వత్తిళ్లు తెస్తున్నారని బయట చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటన పై విద్యాశాఖాధికారులు వాస్తవం తెలుసుకొని విద్యార్థుల పై ఫీజుల వత్తిడి లేకుండా చేయాలని తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు కోరుతున్నారు..