Asianet News TeluguAsianet News Telugu

Udaipur Murder Case : విజయవాడలో హిందుత్వ సంఘాల ఆందోళన

విజయవాడ : మమ్మద్ ప్రవక్తపై అనుచిన వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మ ఫోటోను స్టేటస్ గా పెట్టుకున్నాడని రాజస్థాన్ ఉదయపూర్ లో ఓ సామాన్య టైలర్ ను ఉగ్రవాదులు అతి కిరాతకంగా హతమార్చడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 

Jun 30, 2022, 2:53 PM IST

విజయవాడ : మమ్మద్ ప్రవక్తపై అనుచిన వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మ ఫోటోను స్టేటస్ గా పెట్టుకున్నాడని రాజస్థాన్ ఉదయపూర్ లో ఓ సామాన్య టైలర్ ను ఉగ్రవాదులు అతి కిరాతకంగా హతమార్చడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ దారుణ హత్యను ఖండిస్తూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో  విశ్వహిందు పరిషత్, భజరంగదళ్ నేతలు ఆందోళన  చేపట్టారు. రోడ్డుపై ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేసారు. అతి కిరాతకంగా చంపుతూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడమే కాదు దేశ ప్రధాని మోడీకి కూడ ఇదే గతి పడుతుందని హెచ్చరించడం దేశ సార్వభౌమత్వానికి, ఉదారవాదానికి, లౌకికవాదానికి సవాల్ విసిరినట్టేనని అన్నారు. దేశంలో హిందువులను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని... ఇటువంటి ఉగ్రవాద చర్యలను ఆదిలోనే అణచివేయాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేసారు.