తాడేపల్లిలో ఉద్రిక్తత... సీఎం నివాసం ముట్టడికి మహిళా రైతుల యత్నం
తాడేపల్లి: U1 జోన్ ను ఎత్తివేయాలంటే తాడేపల్లి, కొలనుకొండ, కుంచనపల్లి రైతులు చేపట్టిన నిరసన మరింత ఉదృతమయ్యింది. తాడేపల్లిలో మహిళా రైతులు చేపట్టిన భారీ ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీగా వెళ్లి సీఎం వైఎస్ జగన్ నివాసాన్ని ముట్టడించే అవకాశాలున్నాయన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఎం క్యాంప్ కార్యాలయంతో పాటు చుట్టుపక్కల భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. మహిళల ర్యాలీని పోలీసులు నిరాకరించారు.