దివంగత వైఎస్సార్ విగ్రహం కాళ్లుమొక్కుతూ.... U-1 జోన్ రైతుల వినూత్న నిరసన
తాడేపల్లి: గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, కొలనుకొండ, కుంచనపల్లి గ్రామాల్లోని వ్యవసాయ భూములపై విధించిన U1 జోన్ ను ఎత్తివేయాలని బాధిత రైతులు చేపట్టిన ఆందోళన రోజరోజుకు మరింత తీవ్రతరం అవుతోంది.
తాడేపల్లి: గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, కొలనుకొండ, కుంచనపల్లి గ్రామాల్లోని వ్యవసాయ భూములపై విధించిన U1 జోన్ ను ఎత్తివేయాలని బాధిత రైతులు చేపట్టిన ఆందోళన రోజరోజుకు మరింత తీవ్రతరం అవుతోంది. ఇప్పటికే వివిధ రకాలుగా తమ నిరసన తెలియజేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో రైతులు రిలే దీక్షలకు సిద్దమయ్యారు. దీక్షా శిబిరాన్ని ఏర్పాటుచేసి తమ సమస్య పరిష్కారమయ్యే వరకు నిర్విరామంగా పోరాడేందుకు బాధిత రైతులు సిద్దమయ్యారు. ఇక ఇవాళ తాడేపల్లి వీధుల్లో మహిళా రైతులు ర్యాలీ నిర్వహించారు. సీఎం జగన్ U1 జోన్ ఎత్తివేసేలా చూడాలంటూ దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజేశేఖర్ రెడ్డి విగ్రహానికి కాళ్ళు మొక్కిన రైతులు వినతి పత్రం అందజేసారు.