Asianet News TeluguAsianet News Telugu

వినుకొండలో విషాదం... సెల్ ఫోన్ కోసం చెరువులో దిగి యువకుడు మృతి

వినుకొండ : పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న వేరు వేరు ఘటనల్లో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.  

First Published Sep 29, 2022, 2:41 PM IST | Last Updated Sep 29, 2022, 2:41 PM IST

వినుకొండ : పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న వేరు వేరు ఘటనల్లో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.  బొల్లపల్లి మండలం దొండపాడు చెరువులో మునిగి ఒకరు,  ఈపూరు మండలం కొచ్చర్ల చెరువు వద్ద ప్రమాదానికి గురయి మరొకరు ప్రాణాలు కోల్పోయారు. బొల్లపల్లి మండలం పేరూరుపాడుకు చెందిన ధూపాటి చంద్రశేఖర్ (22) స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని చెరువుకు బహిర్భూమికి వెళ్లాడు. ఈ క్రమంలో అతడి సెల్ ఫోన్ చెరువులో పడిపోవడంతో తీయడానికి నీటిలో దిగి గల్లంతయి ప్రాణాలు కోల్పోయాడు. ఇదిలావుంటూ బ్రతుకుదెరువు కోసం బత్తుల శ్రీకాంత్, బత్తుల  రాంబాబు అనే ఇద్దరు యువకులు ప్రకాశం జిల్లా నుండి తెలంగాణకు బైక్ పై వెళుతుండగా ప్రమాదం జరిగింది. మార్గమధ్యలో ఈపూరు మండలం కొచ్చర్ల చెరువు వద్ద మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఘటనాస్థలంలోనే రాంబాబు మృతిచెందగా శ్రీకాంత్ తీవ్ర గాయాలపాలయ్యాడు.