Asianet News TeluguAsianet News Telugu

దేవాలయం వద్ద ఆకతాయిల వీరంగం... భక్తులపై విచక్షణారహితంగ దాడి

విశాఖపట్నం: దైవదర్శనంతో పాటు సరదాగా గడపడానికి కుటుంబంతో  దేవాలయానికి వచ్చినవారిపై కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. 

విశాఖపట్నం: దైవదర్శనంతో పాటు సరదాగా గడపడానికి కుటుంబంతో  దేవాలయానికి వచ్చినవారిపై కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. అకారణంగా సదరు కుటుంబంతో ఘర్షణకు దిగి విచక్షణారహితంగా దాడికి పాల్పడి గాయపర్చారు. ఈ దుర్ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది.  గొలుగొండ మండలం దారమటం శివాలయానికి నాతవరం మండలానికి చెందిన ఓ కుటుంబం విహార యాత్రకు వచ్చారు. వీరితో పాత మల్లంపేట గ్రామానికి చెందిన కొందరు ఆకతాయి యువకులు ఘర్షణకు దిగారు. ఈ గొడవలో నాతవరంకు చెందిన వారు తీవ్రంగా గాయపడ్డారు. గొడవకు దిగి గాయపర్చిన వారిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు పర్యాటకులు.