Asianet News TeluguAsianet News Telugu

మురికి గుంటలో పడి రెండేళ్ల చిన్నారి మృతి..

కృష్ణా జిల్లా : కృష్ణాజిల్లాలో రెండేళ్ల బాలుడి అదృశ్యం విషాదాంతంగా ముగిసింది.

First Published Aug 24, 2023, 4:07 PM IST | Last Updated Aug 24, 2023, 4:07 PM IST

కృష్ణా జిల్లా : కృష్ణాజిల్లాలో రెండేళ్ల బాలుడి అదృశ్యం విషాదాంతంగా ముగిసింది. పిన్స్ బాబు అనే రెండేళ్ల చిన్నారి మురికి గుంటలో పడి మృతి చెందాడు. ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు గుంటలో పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రిన్స్ బాబు తల్లి అనూష ప్రిన్స్ బాబు కనబడటం లేదంటూ  బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇంటి సమీపంలోని మురికి గుంటలో ప్రిన్స్ బాబు మృతదేహాన్ని గుర్తించారు. దీంతో కపిలేశ్వరపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారి కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.