Asianet News TeluguAsianet News Telugu

ఇదేదో బైక్ షోరూం కాదు... కేవలం ముగ్గురు దొంగిలించిన వాహనాలే ఇవన్నీ..

సత్తెనపల్లి : ఇక్కడ వరుసగా నిలబెట్టిన ద్విచక్రవాహనాలను చూస్తుంటే బైక్ షోరూంలో మాదిరిగా వుందికదా...

First Published Oct 4, 2022, 1:34 PM IST | Last Updated Oct 4, 2022, 1:34 PM IST

సత్తెనపల్లి : ఇక్కడ వరుసగా నిలబెట్టిన ద్విచక్రవాహనాలను చూస్తుంటే బైక్ షోరూంలో మాదిరిగా వుందికదా... కానీ ఇది షోరూం కాదు పోలీస్ స్టేషన్. ద్విచక్రవాహనాలను దొంగిలించడంలో ఆరితేరిన ముగ్గురు దొంగల ముఠా పల్నాడు జిల్లాలో పట్టుబడింది. ఈ ముఠా దొంగిలించిన 55 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇలా పోలీస్ స్టేషన్ ఆవరణలో నిలిపారు. దీంతో స్టేషన్ కాస్త బైక్ షోరూంను తలపిస్తోంది. పల్నాడు జిల్లాలో ఇటీవల కాలంలో ద్విచక్రవాహనాల దొంగతనం కేసులు ఎక్కువయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగల ముఠా ఆటకట్టించారు. బైక్ చోరీలకు పాల్పడుతున్ ముఠాను సత్తెనపల్లిలో పట్టుకున్నారు. కేవలం ముగ్గురు దొంగలతో కూడిన ఈ ముఠా కంటపడిన వాహనాన్ని దొంగిలించేవరకు వదిలిపెట్టేవారుకాదు. ఇలాంటి కరుడుగట్టిన దొంగలను పట్టుకున్న సత్తెనపల్లి పోలీసులను పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి అభినందించారు.