Asianet News TeluguAsianet News Telugu

టూ వీలర్స్ చోరుల ముఠా గుట్టురట్టు: 32 వాహనాలు స్వాధీనం

ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో ని వివిధ జిల్లాల్లో ద్విచక్ర వాహనాలను చోరీకి పాల్పడిన ఎనిమిది మంది ముఠా సభ్యులను అరెస్టు చేయడంతో పాటు వారి నుండి 32 ద్విచక్ర వాహనాలను స్వాధీన పరచుకున్న ట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్  చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో ని వివిధ జిల్లాల్లో ద్విచక్ర వాహనాలను చోరీకి పాల్పడిన ఎనిమిది మంది ముఠా సభ్యులను అరెస్టు చేయడంతో పాటు వారి నుండి 32 ద్విచక్ర వాహనాలను స్వాధీన పరచుకున్న ట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్  చెప్పారు. చిత్తూరు జిల్లా పీలేరు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తొలుత అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల ముఠా సభ్యులు ఎనిమిది మందిని అరెస్టు  చేసి వారి నుండి స్వాధీనపరుచుకున్న 32 ద్విచక్ర వాహనాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పీలేరు పట్టణానికి చెందిన ఒక వ్యక్తి బుల్లెట్ ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు పీలేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసి పీలేరు సీఐ సాధిక్ ఆలీ నేతృత్వంలో  విచారణ చేపట్టిన పోలీసుల కు గురువారం రోజు మదనపల్లి మార్గంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా తాము ద్విచక్ర వాహనాలు చోరీకి పాల్పడ్డ ముఠా అని వెల్లడించారని తెలిపారు. వారినుండి చోరీకి వాడే స్క్రూడ్రైవర్ డూప్లికేట్ తాళాలు ఫ్లగ్ వైరు స్వాధీన పరుచుకొని మరింత లోతుగా విచారించగా తమతోపాటు మరో ఐదు మంది సభ్యులు ఉన్నట్లు ఒప్పుకున్నారు. ఈ ముఠాకు అనంతపురం జిల్లా మడకశిర పట్టణానికి చెందిన సుమంత్ బాబు అలియాస్ పులి గ్రూపు లీడర్ గా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఇతని పై కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉండడం గమనార్హం. ఇతనితో పాటు గోవర్ధన్ పెద్దయ్య గారి దివాకర్ రెడ్డి ,తలారి నరసింహమూర్తి, అంజప్ప , గోవర్ధన్ యాదవ్, సంగమేశ్వర ఫోటో స్టూడియో యజమాని రిషి ఉన్నట్లు వివరించారు. వివిధ ప్రాంతాల్లో చోరీ చేయబడిన అధునాతన బుల్లెట్ వాహనాలతో పాటు ఇతర ద్విచక్ర వాహనాలను  ఓ ఎల్ ఎక్స్ అంతర్జాల విక్రయాల ద్వారా అతి తక్కువ ధరకు ద్విచక్ర వాహనాలను విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారు. ఈ వాహనాలకు సంబంధించిన ఆర్ సి ల ను సంగమేశ్వర ఫోటో స్టూడియో యజమాని రిషి నకిలీ కార్డులను తయారుచేసి కొనుగోలుదారులకు అందజేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసు ఛేదనలో సహకరించిన పీలేరు సి ఐ సాధిక్ అలీ, ఎస్ఐ తిప్పేస్వామి సిబ్బందికి జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు.