Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం... లారీల క్యాబిన్లలో చిక్కుకున్న డ్రైవర్లు, ఒకరు దుర్మరణం

విజయవాడ : ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  తిరువూరు పట్టణ శివారులోని జాతీయ రహదారిపై గ్యాస్ సిలిండర్ లోడ్ తో వెళుతున్న లారీ ఎదురుగా వస్తున్న మరో లారీ ఢీకొన్నాయి.

విజయవాడ : ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  తిరువూరు పట్టణ శివారులోని జాతీయ రహదారిపై గ్యాస్ సిలిండర్ లోడ్ తో వెళుతున్న లారీ ఎదురుగా వస్తున్న మరో లారీ ఢీకొన్నాయి. దీంతో రెండు లారీల డ్రైవర్లు క్యాబిన్లలో ఇరుక్కుపోయారు. గ్యాస్ లోడ్ లారీ క్యాబిన్ పూర్తిగా ధ్వంసమవడంతో అందులో ఇరుక్కుకుపోయిన డ్రైవర్ మృతిచెందాడు. మరో లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను పోలీసులు సురక్షితంగా బయటకు తీసారు. అతడు తీవ్ర గాయాలపాలవగా 108 అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రోడ్డుపైనే రెండులారీలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు భారీ క్రేన్ల సాయంతో లారీలను పక్కకు తీసి ట్రాఫిక్ క్లియర్ చేసారు.