Asianet News TeluguAsianet News Telugu

అనాథాశ్రమం నుంచి ఇద్దరు బాలికల అదృశ్యం

కృష్ణాజిల్లా నందిగామ మండలంలో పెద్దవరం గ్రామ ఊరు శివారు నిర్భయ అనాధ ఆశ్రమంలో ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యమయ్యారు. 

Mar 6, 2021, 2:54 PM IST

కృష్ణాజిల్లా నందిగామ మండలంలో పెద్దవరం గ్రామ ఊరు శివారు నిర్భయ అనాధ ఆశ్రమంలో ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యమయ్యారు. ఈ మేరకుచందర్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శాంతి, ప్రశాంతి  అనే బాలికలను 2013లో మచిలీపట్నంలోని బస్ డిపో వద్ద భిక్షాటన చేస్తుంటే చైల్డ్ వెల్ఫేర్ ద్వారా తమ ఆశ్రమానికి తీసుకొని వచ్చామని నిర్వాహకుడు కృష్ణబాబు తెలిపారు.శుక్రవారం మధ్యాహ్నం బట్టలు ఉతుకుంటామని వెళ్లిన ఇద్దరు బాలికలు  సాయంకాలం వరకు తిరిగి రాకపోవటంతో వారి కోసం గాలింపు చేపట్టామని ఆశ్రమ నిర్వాహకుడు చెప్పాడు. తన ఆశ్రమంలో కోవిడ్ సమయం లో ఉన్న 80 మంది అనాధ పిల్లలను కోవిడ్ కారణంగా చైల్డ్ వెల్ఫేర్ కి తరలించామని చెప్పారు.కేవలం తమ ఆశ్రమంలో నలుగురు మాత్రమే ఉన్నారని, అందులో ఉన్నారని చెప్పారు.  శాంతి, ప్రశాంతి లని వీళ్ళని తన మనవరాలు కన్నా ఎక్కువగా ప్రేమతో చూసుకున్నామన్నారు.