చెరువులో పడి చనిపోయిన చిన్నారులు.. అయ్యో పాపం...
కృష్ణాజిల్లా పెడనలో దారుణం జరిగింది.
కృష్ణాజిల్లా పెడనలో దారుణం జరిగింది. లాక్ డౌన్ వేళ ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెడితే నియోజవర్గంలోని బంటుమిల్లి మండలం మల్లేశ్వరం పంపుల చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వీరిద్దరూ గంగుమోలువర్షిత ,గొర్ల ఇషితగా గుర్తించారు. వారిద్దరి తల్లిదండ్రుల దు:ఖంతో ఆ ఊరంతా శోకసముద్రంలో మునిగిపోయింది.