దళిత స్మశాన వాటిక స్థలానికి సంబంధించి ఇరు కులాల మధ్య గొడవ...
80 ఏళ్లుగా తమ కేటాయించిన భూమిలో మరో సామాజిక వర్గానికి చెందిన చనిపోయిన వ్యక్తిని పాతిపెట్టడం పై చిరావూరు దళిత స్మశాన వాటికలో మరో సామజిక వర్గం వారు ఆందోళనకు దిగారు.
80 ఏళ్లుగా తమ కేటాయించిన భూమిలో మరో సామాజిక వర్గానికి చెందిన చనిపోయిన వ్యక్తిని పాతిపెట్టడం పై చిరావూరు దళిత స్మశాన వాటికలో మరో సామజిక వర్గం వారు ఆందోళనకు దిగారు. వారికి ఉన్న భూమిని ఎవరికి వారుగా అమ్మేసుకొని ఇలా తమ స్మశాన వాటికలో శవాన్ని పూడ్చి పెట్టడం ఏంటని ప్రశ్నిస్తూ... ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఎవరి స్మశానాన్ని వారు వినియోగించుకోమని చెప్పినా... ఇలా తమ సామాజికవర్గానికి కేటాయించిన చోటులో పాతిపెట్టడం తగదు అంటూ స్మశానంలోనే ఆందోళన వ్యక్తం చేశారు ఇకపై ఎవరి స్మశానం వారే వినియోగించుకునే విధంగా ఒకరి దాంట్లోకి మరొకరు రాకుండా పటిష్టంగా బందోబస్తు చేయాలని ఇరు వర్గాలు కోరుతున్నారు.