Asianet News TeluguAsianet News Telugu

పెనమలూరులో బిచ్చగత్తెపై గ్యాంగ్ రేప్... ఇద్దరు నిందితుల అరెస్ట్

పెనమలూరు :  కృష్ణా జిల్లా పెనమలూరులో బిక్షాటన చేసుకునే మహిళపై ముగ్గురు కామాంధులు గ్యాంగ్ రేప్ కు పాల్పడటం సంచలనంగా మారింది.

First Published Dec 20, 2022, 5:30 PM IST | Last Updated Dec 20, 2022, 5:30 PM IST

పెనమలూరు :  కృష్ణా జిల్లా పెనమలూరులో బిక్షాటన చేసుకునే మహిళపై ముగ్గురు కామాంధులు గ్యాంగ్ రేప్ కు పాల్పడటం సంచలనంగా మారింది. ఈ  దారుణానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు... పరారీలో వున్న మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోందని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా వెల్లడించారు. పట్టుబడిన ఇద్దరు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. 

ఈ సందర్భంగా ఈ గ్యాంగ్ రేప్ కు సంబంధించిన వివరాలను ఎస్పీ జాషువా మీడియాకు వివరించారు. రేపల్లెకు చెందిన బాధిత మహిళ ఉపాధి నిమిత్తం విజయవాడకు వలసవచ్చి బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కింద బాలకోటి అనే వ్యక్తితో సహజీవనం సాగిస్తోందని తెలిపారు. సులభ్ కాంప్లెక్స్ లో పనిచేసే శ్రీను అనే వ్యక్తితో కూడా ఆమెకు పరిచయం వుందని... దీంతో అతడు పని వుందని చెబితే వెంటవెళ్లిందని అన్నారు. ఆమెను పెనమలూరుకు తీసుకెళ్ళి ఓ గదితో బంధించిన శ్రీను స్నేహితులు నాగరాజు, రవితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. ఇలా మూడురోజుల పాటు అత్యాచారం అనంతరం బాధితురాలిని శ్రీను బాలకోటికి అప్పగించాడని... తీవ్ర అనారోగ్యానికి గురయిన ఆమెను ప్రభుత్వాస్పత్రిలో చేర్చాడని ఎస్పీ తెలిపారు. హాస్పిటల్ వైద్యుల సమాచారంతో పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నట్లు ఎస్పీ జాషువా వెల్లడించారు.