Asianet News TeluguAsianet News Telugu

బనగానపల్లెలో పన్నెండుమంది పోలీసులకు కరోనా...

కర్నూలు జిల్లా, బనగానపల్లె నియోజికవర్గం పరిధిలో కరోనా వైరస్  విజృంభిస్తుంది. 

కర్నూలు జిల్లా, బనగానపల్లె నియోజికవర్గం పరిధిలో కరోనా వైరస్  విజృంభిస్తుంది. బనగానపల్లె పోలీస్ స్టేషన్ సర్కిల్ పోలీసుల్లో ఒక హెడ్ కానిస్టేబుల్, ఏడుగురు కానిస్టేబుళ్లు, నలుగురు హోంగార్డులకు మొత్తం కలిపి 12మందికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ పరీక్షల్లో ఇద్దరు ఎస్ఐ లకు నెగిటివ్ వచ్చింది. కాగాసిఐ సురేష్ కుమార్ రెడ్డి కి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇంకా ఫలితాలు రాలేదు. కరోనా వైరస్ ఉదృతంగా వ్యాపిస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనల్లో ఉన్నారు.