Asianet News TeluguAsianet News Telugu

నా భార్యపై అక్రమ సంబంధం నిందలు... ఎస్పీ వ్యాఖ్యలు దారుణం: తుమ్మపూడి మృతురాలి భర్త ఆవేదన

గుంటూరు: తుమ్మపూడి వివాహిత హత్యకు అక్రమసంబంధమే కారణమంటూ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వ్యాఖ్యలపై మృతురాలి భర్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. 

First Published Apr 29, 2022, 3:56 PM IST | Last Updated Apr 29, 2022, 3:56 PM IST

గుంటూరు: తుమ్మపూడి వివాహిత హత్యకు అక్రమసంబంధమే కారణమంటూ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వ్యాఖ్యలపై మృతురాలి భర్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. దయచేసి తన భార్యపై నిందలువేస్తూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని... లేదంటే జీవితాంతం తాను,తనబిడ్డలు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన చెందాడు. ఎస్పీ చేత ప్రకటన ఏ పార్టీ, ఏ నాయకులు చేయించారో గానీ తమ జీవితాలను కూడా నాశనంచేసేలా ఆ వ్యాఖ్యలు వున్నాయన్నారు. మీ ఇంట్లోనూ ఆడబిడ్డలు వుండివుంటారు... అలాంటి మీకు చనిపోయిన మహిళపై ఇలాంటి నిందలెలా వేయాలనిపించింది అని ఎస్పీని అడిగారు. నా భార్యకు అక్రమ సంబంధం అంటూ మీరు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని... లేదంటే ఎస్పీ కార్యాలయం కార్యాలయం ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని మృతురాలి భర్త హెచ్చరించారు.