భక్తుల కోసం కర్రలు సిద్దం చేస్తున్న టిటిడి...

తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలిచే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనానికి కాలినడకన వెళుతున్న భక్తులు అడవిజంతువులు దాడికి గురవుతున్న విషయం తెలిసిందే. 

First Published Aug 16, 2023, 6:11 PM IST | Last Updated Aug 16, 2023, 6:11 PM IST

తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలిచే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనానికి కాలినడకన వెళుతున్న భక్తులు అడవిజంతువులు దాడికి గురవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కొండపైకి వెళ్లే నడకమార్గంలో చిన్నారులను చిరుత ఎత్తుకెళ్లిన ఘటనలు కలకలం రేపాయి. ఓ చిన్నారి చిరుత దాడినుండి ప్రాణాలతో బయటపడగా లక్షిత అనే ఆరేళ్ల చిన్నారి మాత్రం మృతిచెందింది. చిన్నారి మృతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీంతో కాలినడకన కొండపైకి వెళ్లే భక్తుల రక్షణ కోసం చేతికర్రలు అందించాలని టిటిడి నిర్ణయించింది. ఈ క్రమంలోనే భక్తుల కోసం కర్రలను సిద్దం చేస్తోంది టిటిడి.