Asianet News TeluguAsianet News Telugu

తలనీలాల స్మగ్లింగ్ వివాదం... కస్టమ్స్ సీజడ్ రిపోర్టులో ఏముందంటే: టిటిడి ఏఈవో ధర్మారెడ్డి

తిరుమల: ప్రపంచంలోని హిందువులందరూ తిరుమలను ఆధ్యాత్మిక రాజధానిగా భావిస్తారని... 

తిరుమల: ప్రపంచంలోని హిందువులందరూ తిరుమలను ఆధ్యాత్మిక రాజధానిగా భావిస్తారని... అలాంటి ఆలయ పవిత్రకు భంగం కలిగించకుండా పనిచేసే టీటీడీపై అనవసర ప్రచారం చేయడం తగదని టీటీడీ అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి సూచించారు. మయన్మార్ సరిహద్దులో దొరికిన తలనీలాల సీజడ్ రిపోర్టులో టీటీడీ పేరు లేదని... అయినప్పటికి టీటీడీ తలనీలాలంటూ కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. రూ.18.17 లక్షల అన్ ప్రోసెసడ్  హెయిర్ ను పట్టుకున్నట్టు కస్టమ్ అధికారులు తెలిపారని... అయితే టీటీడీలో ప్రోసెస్ చేయకుండా తలనీలాలు విక్రయించమన్నారు. కట్టుదిట్టమైన భద్రతతో తలనీలాలను తిరుమల నుండి తిరుపతికి తరలిస్తామని... ఒక్క వెంట్రుక కూడా దొంగతనంగా బయటకు వెళ్లే అవకాశం లేదన్నారు. చీప్ పాపులారిటీ కోసం కొన్ని మీడియా చానళ్లు టీటీడీ ఉద్యోగులపై నిందలు వేస్తున్నారని... ఈ దుష్ప్రచారం టీటీడీ ఉద్యోగులను బాధిస్తోందన్నారు. ఇలా టిటిడిపై దుష్ప్రచారం చేసిన 6సంస్థలపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారని దర్మారెడ్డి వెల్లడించారు.