సింహాచలంలో విషాదం.. పుష్కరిణిలో మునిగి భక్తుడి మృతి...

సింహాచలం :  సింహాద్రి అప్పన్న పుష్కరిణిలో చెరువులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయి ర్లే మోహన్ రావు(16) అనే భక్తుడు మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతర్ల పల్లి గ్రామానికి చెందిన గొర్లె మోహన్ రావు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. పుష్కరిణిలో స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.దేవస్థానం అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో 2 నెలల కిందట ఓ భక్తుడు పుష్కరిణిలో స్థానాలు చేయడానికి వీలుగా పూడికలు తీయాలని విజ్ఞప్తి చేసిన  అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహించారు. బురద నీటిలో భక్తులు స్నానాలు చేస్తుంటే కనీస భద్రతా ప్రమాణాలు తీసుకోలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న గోపాలపట్నం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు.

First Published Apr 16, 2022, 2:33 PM IST | Last Updated Apr 16, 2022, 2:33 PM IST