బల్లిపర్రుతో చలపతిరావుకు ఆత్మీయానుబంధం... గ్రామంలో విషాద ఛాయలు
పామర్రు : సీనియర్ టాలీవుడ్ నటుడు చలపతిరావు హఠాన్మరణంతో ఆయన స్వగ్రామంలో విషాదం అలుముకుంది.
పామర్రు : సీనియర్ టాలీవుడ్ నటుడు చలపతిరావు హఠాన్మరణంతో ఆయన స్వగ్రామంలో విషాదం అలుముకుంది. కృష్ణా జిల్లా పామర్రు మండలం బలిపర్రు గ్రామస్తులు చలపతిరావును గుర్తుచేసుకుంటూ బాధపడుతున్నారు. చలపతిరావు కుటుంబ సభ్యులతో కలిసి తరచూ బలిపర్రు వచ్చి గడిపేవారని గుర్తుచేసుకున్నారు. పుట్టిపెరిగిన గ్రామాన్ని అభివృద్ది చేయాలని కాంక్షించేవారని... ఈ క్రమంలోనే దేవాలయ నిర్మాణానికి ఆర్థిక సాయం కూడా చేసారని అన్నారు. అలాంటి గొప్పవ్యక్తి మృతి సినీ పరిశ్రమకే కాదు బలిపర్రు గ్రామానికి తీరని లోటని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేసారు.