సిపిఎస్ పాత పెన్షన్ పునరుద్ధరణకు సెప్టెంబర్ 1న ఉద్యోగ సంఘాల నిరసన.. లాడ్జీల్లో తనిఖీలు..

విజయవాడ : సిపిఎస్ పాత పెన్షన్ పునరుద్ధరణ  కొరకు సెప్టెంబర్ 1న ఉద్యోగ సంఘాలు తలపెట్టిన కార్యక్రమాలకు ఎటువంటి అనుమతులు లేవని ఏసీపీ నాగేశ్వరరెడ్డి సిఐ కనకారావు తెలిపారు.

First Published Aug 27, 2022, 12:57 PM IST | Last Updated Aug 27, 2022, 12:57 PM IST

విజయవాడ : సిపిఎస్ పాత పెన్షన్ పునరుద్ధరణ  కొరకు సెప్టెంబర్ 1న ఉద్యోగ సంఘాలు తలపెట్టిన కార్యక్రమాలకు ఎటువంటి అనుమతులు లేవని ఏసీపీ నాగేశ్వరరెడ్డి సిఐ కనకారావు తెలిపారు. నగర కమిషనర్ ఆదేశాల మేరకు ఏసీపీ రమణమూర్తి ఆధ్వర్యంలో గాంధీ నగర్ లో లాడ్జిల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయులు తలపెట్టిన నిరసనకు అనుమతి లేదని ఏసీపి రమణమూర్తి తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైనా నగరానికి వచ్చి లాడ్జిలలో బస చేస్తే తమకు తెలుపాలని యాజమాన్యానికి సూచనలు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా లాడ్జిలలో దిగిన తమకు తెలపాలన్నారు. ఉద్యమకారుల ముసుగులో అరాచకాల సృష్టించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమైన సమాచారం ఉందన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు నిరసన అనుమతి లేదని ఇప్పటికే వారికి స్పష్టం చేశామన్నారు. ఎవరైనా హద్దు మీరితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసిపి రమణమూర్తి తెలిపారు,