విశాఖ హార్బర్ లో విషవాయువుల లీకేజీ... ప్రాణయంతో పరుగుపెట్టిన మత్స్యకారులు
విశాఖ పట్నంలో మరోసారి విషవాయువుల లీకేజీ కలకలం రేపింది.
విశాఖ పట్నంలో మరోసారి విషవాయువుల లీకేజీ కలకలం రేపింది. విశాఖ హార్బర్ ప్రాంతంలో రాత్రి 8గంటల సమయంలో విషవాయువులు లీకవడంతో మత్స్యకారులు ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఒక్కసారిగా కళ్లలో మంట, వాంతులు కావడంతో అప్రమత్తమైన మత్స్యకారులు పిల్లాపాపలతో కలిసి ప్రాణాలు అరచేత పట్టుకుని సురక్షిత ప్రాంతానికి పరుగుపెట్టారు. కొద్దిసేపటి తర్వాత పరిస్థితి చక్కబడటంతో తిరిగివచ్చిన మత్స్యకారులు అర్ధరాత్రి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అండ్ ట్రైనింగ్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో మత్యకారులు గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త త చోటుచేసుకుంది.