Capital Crisis : నేటి అమరావతి బంద్ వాయిదా...
అమరావతి పరిరక్షణ కమిటీ, పొలిటికల్ జేఏసీ శనివారం తలపెట్టిన జిల్లా బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు.
అమరావతి పరిరక్షణ కమిటీ, పొలిటికల్ జేఏసీ శనివారం తలపెట్టిన జిల్లా బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ నుంచి రాజధాని అమరావతిపై స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు ఆందోళనలు ఆపమని తేల్చి చెప్పారు. భవిష్యత్తు కార్యాచరణ జనవరి 3న ప్రకటిస్తామన్నారు. అప్పటి వరకు రిలే నిరాహార దీక్షలతో మండలాల వారీగా తమ నిరసనలు తెలియజేస్తామని తెలిపారు.