ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ వివాదం... బిజెపి నేతల అరెస్ట్
కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహా ఏర్పాటు ప్రయత్నాలు ఉద్రిక్తతకు దారితీశాయి.
కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహా ఏర్పాటు ప్రయత్నాలు ఉద్రిక్తతకు దారితీశాయి. టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటును నిరసిస్తూ బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డితో సాటు పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు జిన్నా రోడ్డుకు వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు బిజెపి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. విష్ణు వర్ధన్ రెడ్డితో పాటు కిసాన్ మోర్చా అధ్యక్షుడు శశిభూషణ్, జిల్లా ఇంచార్జి అంకాల్ రెడ్డి యల్లా రెడ్డి , భాస్కర్ ఇతర నేతలు కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
బీజేపీ నేతలు కార్యకర్తలు అక్రమ అరెస్టులను రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన నేతలు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని వీర్రాజు డిమాండ్ చేశారు.