Asianet News TeluguAsianet News Telugu

పోలీసుల పహారాలోనే ఇప్పటం గ్రామం

గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. 

First Published Nov 6, 2022, 5:31 PM IST | Last Updated Nov 6, 2022, 5:31 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధితులను పరామర్శించిన నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. గ్రామం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గ్రామంలో వున్న వైఎస్సార్ విగ్రహాలకు కంచెల ద్వారా రక్షణ కల్పించారు. దీంతో వివిధ పనులకు వెళ్లే గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగన్ ప్రభుత్వ చర్యలపై ఇప్పటం గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.