శ్రీశైలం రహదారిపై పెద్దపులి హల్చల్... హడలిపోయిన ప్రయాణికులు

శ్రీశైల ఆలయ   ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి పెద్ద పులి హల్ చల్ చేసింది. ఒక ద్వారా సమీపంలో రోడ్డు దాటుతూ ప్రయాణికులకు పెద్దపులి తారసపడింది. వాహనంలో వెళుతున్న ప్రయాణికులు మొదట ఆవు గా భావించి వాహనం ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పెద్దపులి గా గుర్తించి రోడ్డుపైనే వాహనాలను నిలిపివేశారు. కొద్దిసేపటి వరకు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని వాహనాలను గడిపారు. రోడ్డుపై కొద్దిసేపు బైఠాయించిన పెద్దపులి, దీంతో హడలి పోయిన ప్రయాణికులు శ్రీశైల భ్రమరాంబికా ,మల్లికార్జున స్వామి వార్లను తలుచుకున్నారు. దాదాపు ఇరవై నిమిషాలు రోడ్డుపై బైఠాయించిన పులి ఆ తర్వాత అక్కడ చెట్లపొదల నుంచి రోడ్డు మీదుగా అడవిలోకి వెళ్ళిపోయింది. ఈ సన్నివేశాన్ని కొందరు ప్రయాణికులు సెల్ఫోన్లో చిత్రీకరించారు.

First Published Nov 22, 2021, 9:25 AM IST | Last Updated Nov 22, 2021, 9:25 AM IST