Asianet News TeluguAsianet News Telugu

Telugu news updates: నేటి ముఖ్యవార్తలు

ఏపీకి మూడు రాజధానులు అంశం టీడీపీలో చిచ్చును రేపింది.విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్, ఎన్ఆర్‌సీపై చంద్రబాబునాయుడు వైఖరిని నిరసిస్తూ విశాఖ మాజీ ఎమ్మెల్యే రహమాన్ టీడీపీకి రాజీనామా చేశారు. 

ఏపీకి మూడు రాజధానులు అంశం టీడీపీలో చిచ్చును రేపింది.విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్, ఎన్ఆర్‌సీపై చంద్రబాబునాయుడు వైఖరిని నిరసిస్తూ విశాఖ మాజీ ఎమ్మెల్యే రహమాన్ టీడీపీకి రాజీనామా చేశారు. త్వరలోనే రహమాన్ వైసీపీలో చేరనున్నారు.ఐదు దశాబ్దాల తర్వాత  సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ సూర్యగ్రహణం దేశంలోని పలు ప్రాంతాల్లో కన్పించింది. సూర్యగ్రహణాన్ని చూడలేదని  ప్రధాని చూడలేదని  ట్వీట్ చేశారు. సూర్యగ్రహణం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయాన్ని తెరిచి ఉంచారు. ఈ ఆలయంలో భక్తులు ఇవాళ పూజలు చేశారు.ఏపీకి మూడు రాజధానుల అంశం ఏపీలో చిచ్చును రేపుతోంది. ఏపీ కేబినెట్ సమావేశం ఈ నెల 27వ తేదీన జరగనుంది.ఈ సమావేశంలో జీఎన్ రావు కమిటీకి ఆమోదముద్ర వేయనున్నారు. ఏపీకి మూడు రాజధానులు వద్దంటూ అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు ఎనిమిది రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు