సత్తెనపల్లిలో ఘోరం... సెప్టిక్ ట్యాంక్ లో పడి ముగ్గురు మృతి

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విషాదం చోటుచేసుకుంది.  

First Published Aug 21, 2022, 11:14 AM IST | Last Updated Aug 21, 2022, 11:14 AM IST

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విషాదం చోటుచేసుకుంది.  పట్టణంలోని న్యూవినాయక రెస్టారెంట్ లో సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కు వెళ్లిన ఇద్దరు కూలీలతో పాటు మరొకరు ప్రమాదవశాత్తు మృతిచెందారు. మృతులు కొండల్ రావు, అనిల్, బ్రహ్మంగా గుర్తించారు. ఒకరు ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంక్ లో పడిపోగా మిగతా కూలీతో పాటు ఓనర్ కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ ఇద్దరూ ప్రమాదానికి గురయి ముగ్గురూ  ప్రాణాలు కోల్పోయారు. సహాయక సిబ్బంది ముగ్గురి మృతదేహాలను సెప్టిక్ ట్యాంక్ నుండి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు.