అంగట్లో సరుకులా అమ్మాయి అమ్మకం... పదకొండుమంది చేతులుమారిన పసికందు

మంగళగిరి: గుంటూరు జిల్లాలో అమానుషం చోటుచేసుకుంది. మూడు నెలల పసికందుకు కన్నతండ్రే డబ్బులకోసం అంగట్లో సరుకులా అమ్మేసిన దారుణం వెలుగుచూసింది. ఇలా విక్రయించిన చిన్నారి ఏకంగా పదకొండుమంది చేతులు మారి చివరకు పోలీసులు చొరవతో తల్లిఒడికి చేరిందిమంగళగిరికి చెందిన రాణి-మనోజ్ దంపతులకు మూడో సంతానంగా ఇటీవల ఆడబిడ్డ జన్మించింది. అయితే ఆర్థిక ఇబ్బందులతో మూడు నెలల చిన్నారిని తండ్రి డెబ్భై వేలకు గాయత్రికి విక్రయించాడు. గాయత్రి ఇంకొకరికి, వారు మరొకరికి ఇలా చిన్నారికి అంగట్లో సరుకులా ధర పెంచుకుంటు అమ్ముతూ వెళ్లారు. చివరకు పాపను రూ.2,50,000 హైదరాబాద్ కు చెందిన రమేష్ కొనుగోలుచేసాడు. శిశువు విక్రయంపై ఫిర్యాదు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి పదకొండుమందిని అరెస్ట్ చేసి చిన్నారిని తల్లిఒడికి చేర్చారు. 

First Published Mar 30, 2022, 10:08 AM IST | Last Updated Mar 30, 2022, 10:08 AM IST