Asianet News TeluguAsianet News Telugu

నీట మునిగిన సంగమేశ్వరాలయం.. తిరిగి 8 నెలల తరువాతే..

కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ఒకటైన సంగమేశ్వర ఆలయంలోకి మళ్లీ నీరు చేరింది. 

కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ఒకటైన సంగమేశ్వర ఆలయంలోకి మళ్లీ నీరు చేరింది. ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా చేరడంతో ఆలయం నీట మునిగింది. దీంతో సప్తనది సంగమ తీరంలో వెలిసిన సంగమేశ్వరుడు కృష్ణమ్మ ఒడిలోకి చేరుకున్నాడు. ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ ఆధ్వర్యంలో చివరిసారిగా ఆలయంలోని వేప దారి శివలింగంకు పూజలు చేశారు. ఈ ఆలయం ఇప్పుడు మునిగితే బయటికి వచ్చేందుకు మరో ఏడాది పట్టే అవకాశం ఉంటుంది. ప్రతిఏటా ఇది ఓ అద్భుత ఘటం... కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 40కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది. ఏకంగా ఏడునదులు కలిసే ప్రదేశం. ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం ఉంటుంది.