Asianet News TeluguAsianet News Telugu

విజయవాడ నగర అభివృద్ధికి పురపాలక సంస్థ కట్టుబడి ఉంది.. వెల్లంపల్లి శ్రీనివాస్ రావు

విజయవాడ : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భవానిపురం పున్నమిఘాట్ వద్ద ఇండియన్ స్వచ్ఛ లీగ్ కార్యక్రమం నిర్వహించారు. 

First Published Sep 17, 2022, 1:29 PM IST | Last Updated Sep 17, 2022, 1:29 PM IST

విజయవాడ : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భవానిపురం పున్నమిఘాట్ వద్ద ఇండియన్ స్వచ్ఛ లీగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు కలెక్టర్ ఢిల్లీ రావు మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొని ఇండియన్ స్వచ్ఛ్ ర్యాలీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. భారతదేశంలోనే స్వచ్ఛ సిటీలో ఒకటిగా నిలిచిన విజయవాడ నగర ప్రజల సహాయసహకారాలతోనే ఇది సాధ్యమైందని విజయవాడ నగర అభివృద్ధికి విజయవాడ నగర పురపాలక సంస్థ కట్టుబడి ఉందని మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ రావు తెలిపారు. పారిశుద్ధ్యం నగర పచ్చదనం పరిశుభ్రత వంటి బృహత్తర కార్యక్రమాల పై అవగాహన కోసం ఈ కార్యక్రమం నిర్వహించామని కృష్ణా జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు.