సజ్జల వద్దకు తాడికొండ పంచాయితీ... డొక్కా నియామకంపై ఎమ్మెల్యే శ్రీదేవి సీరియస్

తాడేపల్లి : గుంటూరు జిల్లా తాడికొండ వైసిపిలో వర్గపోరు తారాస్థాయికి చేరి పంచాయితీ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వద్దకు చేరింది.

First Published Aug 30, 2022, 10:03 AM IST | Last Updated Aug 30, 2022, 10:07 AM IST

తాడేపల్లి : గుంటూరు జిల్లా తాడికొండ వైసిపిలో వర్గపోరు తారాస్థాయికి చేరి పంచాయితీ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వద్దకు చేరింది. తాడికొండ నియోజకవర్గ వైసిపి అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియమించడంపై స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో పాటు ఆమె వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. డొక్కాను వెంటనే ఆ పదవి నుండి తొలగించాలని ఎమ్మెల్యే వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఎమ్మెల్యే శ్రీదేవి భారీగా అనుచరగణంతో సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసారు. తాడికొండ బాధ్యతలు డొక్కాకు అప్పగించడంతో స్థానికంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని.. వెంటనే ఆయనను తొలగించాలని శ్రీదేవి డిమాండ్ చేసారు. సజ్జలతో శ్రీదేవితో పాటు మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత కూడా భేటీ అయ్యారు.