ఉద్రిక్తత... రాజుపలెం సర్పంచ్ వర్గీయులపై దాడి, తలలు పగిలి రక్తసిక్తం
Apr 8, 2021, 4:59 PM IST
పరిషత్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం రాజుపాలెం గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ బూత్ వద్దే రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ గొడవలో గ్రామ సర్పంచ్ కమ్మ నాగమల్లి వర్గానికి చెందిన నెప్పల సాంబయ్య, కమ్మ వీరయ్య ఓటేయడానికి పోలింగ్ బూత్ వద్దకు వెళ్లగా వారిపై దాడిచేశారు. దీంతో వారి తలలు పగలడమే కాదు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స కోసం కారులో హాస్పిటల్ కు తరలించారు.