పలాసలో ఉద్రిక్తత... అచ్చెన్నాయుడును అడ్డుకున్న పోలీసులు, వాగ్వాదం
శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్రిక్తత కొనసాగుతోంది.
శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పట్టణంలోని శ్రీనివాస నగర్ కాలనీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అధికారులు సిద్దమవగా... తమపై కక్షతో వైసిపి ప్రభుత్వం ఈ కూల్చివేతలు చేపడుతోందని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో టిడిపి నాయకులు కూల్చివేతలను అడ్డుకోగా పోలీసులు వారిని అరెస్ట్ చేసారు. ఇలా ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పలాస పర్యటనకు సిద్దమవగా పోలీసులు అడ్డుకున్నారు. అచ్చెన్నాయుడును పలాస టోల్ ప్లాజా వద్దే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అచ్చెన్నాయుడితో పాటు టిడిపి నాయకులు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అచ్చెన్నాయుడు కారువద్దకు రాకుండా పోలీసులను కార్యకర్తలు అడ్డుకున్నారు.