గుంటూరు టిడిపి కార్యాలయంలోకి దూసుకెళ్లిన పోలీసులు... తీవ్ర ఉద్రిక్తత

గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పదో తరగతి ఫలితాలపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నేతలు గుంటూర పార్టీ కార్యాలయ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు

First Published Jun 8, 2022, 2:07 PM IST | Last Updated Jun 8, 2022, 2:07 PM IST

గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పదో తరగతి ఫలితాలపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నేతలు గుంటూర పార్టీ కార్యాలయ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు.  దీంతో పోలీసులు పార్టీ కార్యాలయంలోకి వెళ్లి మరీ నిరసనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో టిడిపి శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే కార్యాలయంలోంచి బయటకు వెళ్లాలంటూ పోలీసులను అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఇందులో కొందరు యువకులు స్వల్పంగా గాయపడ్డారు.