Asianet News TeluguAsianet News Telugu

మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులు...వైసీపీ, టీడీపీ శ్రేణుల పరస్పర దాడులు..

పల్నాడు జిల్లా : మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 

First Published Dec 17, 2022, 10:06 AM IST | Last Updated Dec 17, 2022, 10:06 AM IST

పల్నాడు జిల్లా : మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో వైసీపీ, టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నాయి. దాడిలో పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకుని ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. దాడి చేసినవారిపై కేసు నమోదు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో టీడీపీ ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని పోలీసులు  నిలిపివేశారు.టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూలకంటి బ్రహ్మారెడ్డిని మాచర్ల పోలీసులు గుంటూరు తరలించారు.