ఆదుకోకపోతే ఆలయంలోనే ఆత్మహత్య.. ఓ పూజారి సెల్ఫీ వీడియో..
ప్రకాశం జిల్లా చీరాల బోస్ నగర్ లోని అంజనేయస్వామి దేవాలయ పూజారి చక్రవర్తి సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది.
ప్రకాశం జిల్లా చీరాల బోస్ నగర్ లోని అంజనేయస్వామి దేవాలయ పూజారి చక్రవర్తి సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. కరోనాతో ఆలయాలు మూతపడి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని పేర్కొన్నారు. కానుకలు లేక, జీతాలు లేక బతకడం ఇబ్బందైపోయిందని వాపోతున్నాడు. అర్చకులకు ప్రభుత్వం ప్రకటించిన 5వేలు కూడా అందడం లేదంటున్నాడు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, ఇల్లు గడవడానికి అప్పులు చేశానని ఇప్పటికైనా ఆదుకోకపోతే ఆత్మహత్యే గతి అంటున్నాడు.