ఎడ్ల బండిపై స్కూటర్...పెట్రోల్, డిజిల్ ధరలపై తెలుగు యువత నిరసన
Apr 7, 2021, 3:16 PM IST
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకి నిరసనగా వెంకటగిరి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎద్దుల బండి పై స్కూటర్ ని పెట్టి దానిని లాగుతూ నిరసన తెలిపారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతో సామాన్యుడి నడ్డి విరుగుతుందని... ప్రజలు సంపాదించిన డబ్బంతా దీనికే సరిపోతుందని... తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని తెలుగు యవత నాయకులు డిమాండ్ చేశారు.
వీటిపై కేంద్రాన్ని ప్రశ్నించాలంటూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించి పార్లమెంటుకు పంపించాలని ప్రజలకు సూచించారు. ఇటువంటి సమస్యలపై ఆమె పోరాటం చేస్తూ సామాన్యుడికి అండగా నిలబడతారని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, తెలుగు యువత తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు రవి నాయుడు,
వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కురుగొండ్ల రామకృష్ణ మరియు పెద్ద ఎత్తున యువత పాల్గొనడం జరిగింది.