అంగవైకల్యంతోనూ అద్భుతాలు... పారా ఏషియన్ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్ షేక్ అర్షద్ కు జగన్ అభినందనలు
అమరావతి : అంగవైకల్యాన్ని జయించి జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేధికలపై అద్భుతాలు సృష్టిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రతిష్టను మరింత పెంచుతున్నాడు షేక్ అర్షద్.
అమరావతి : అంగవైకల్యాన్ని జయించి జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేధికలపై అద్భుతాలు సృష్టిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రతిష్టను మరింత పెంచుతున్నాడు షేక్ అర్షద్. నంద్యాలకు చెందిన ఇతడు అంగవైకల్యాన్ని శాపంగా భావించకుండా అని అవయవాలు బాగున్నవారికి తాను ఏమాత్రం తక్కువకాదని నిరూపిస్తున్నాడు. ఇలా ఇటీవల ఢిల్లీలో జరిగిన పారా ఏషియన్ ట్రాక్ సైక్లింగ్‌లో వెండి, కాంస్య పతకాలు సాధించిన సత్తాచాటాడు అర్షద్. తాజాగా తాను సాధించిన పతకాలతో సీఎం జగన్ ను కలిసాడు అర్షద్. ఈ సందర్భంగా అతడిని అభినందించిన సీఎం ప్రభుత్వం తరపున అన్నిరకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ ఫెన్సింగ్ క్రీడాకారిణి మురికినాటి బేబి రెడ్డి కూడా సీఎం జగన్ కు కలిసారు. ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచిన టీమ్ లో బేబి రెడ్డి ఒకరు. కామన్వెల్త్ పతకంతో తనవద్దకు వచ్చిన బేబి రెడ్డిని సీఎం జగన్ అభినందించారు.