Asianet News TeluguAsianet News Telugu

ఆసియా స్కూల్ చెస్ ఛాంపియన్ షిప్ లో తెలుగు అక్కాచెల్లి రికార్డ్.. అభినందించిన మంత్రి రోజా

తిరుపతి : ఆసియా స్కూల్స్ చెస్ ఛాంపియన్ షిప్ 2022 లో సత్తాచాటిన తెలుగు అక్కాచెల్లిని మంత్రి ఆర్కె రోజా అభినందించారు. 

First Published Dec 13, 2022, 8:52 PM IST | Last Updated Dec 13, 2022, 8:52 PM IST

తిరుపతి : ఆసియా స్కూల్స్ చెస్ ఛాంపియన్ షిప్ 2022 లో సత్తాచాటిన తెలుగు అక్కాచెల్లిని మంత్రి ఆర్కె రోజా అభినందించారు. డిసెంబర్ 3 నుండి 10వ తేదీవరకు శ్రీలంకలో జరిగిన ఆసియా స్కూల్స్ చెస్ ఛాంపియన్ షిప్ భారతదేశం తరపున తిరుపతికి చెందిన అక్కాచెల్లి త్రిపురాంబిక, శ్రీగురువర్షిణి ప్రాతినిధ్యం వహించారు. ఈ క్రమంలోనే అండర్ 11 బాలికల విభాగంలో త్రిపురాంబికరన్నరప్ గానే కాదు ర్యాపిడ్ విభాగంలో సత్తాచాటి రెండు రజత పతకాలు సాధించింది. అండర్ 7 బాలికల విభాగంలో శ్రీగురు వర్షిణి సత్తాచాటి మూడు స్వర్ణ పతకాలు సాధించింది. ఇలా అంతర్జాతీయ స్థాయిలో భారత ఖ్యాతిని పెంచి తెలుగు చిన్నారులను మంత్రి రోజా ప్రత్యేకంగా అభినందించి శాలువాతో సత్కరించారు.